హీరోయిన్‌తో స్టెప్పులేసిన ఎంపీ..

SMTV Desk 2019-01-18 15:58:55  Raveena tandon, TMC MP, Saguta roy, dance

కోల్‌కతా, జనవరి 18: ప్రముఖ హిందీ నటి రవీనా టాండన్‌తో కలిసి తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సగుతా రాయ్ స్టెప్పులేసిన వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. కోల్‌కతాలో గురువారం టీఎంసీ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి రవీనా టాండన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వేదికపై ఉన్న సగుతా రాయ్‌ను తనతో కలిసి డాన్స్‌ చేయాల్సిందిగా ఆమె కోరారు. 1994లో విడుదలైన తన ‘మోహ్రా చిత్రంలోని ‘తూ చీజ్‌ బడీ హై మస్త్‌ పాటకు ఎంపీతో కలిసి రవీనా స్టెప్స్ వేశారు.అనంతరం వేదికపై ఉన్న ఇతర నేతలను కూడా స్టెప్పులేయాలంటూ రవీనా ఆహ్వానించారు. డెబ్బై ఏళ్ల వయస్సులో కూడా ఇంత జోష్‌గా ఉండే వ్యక్తిని తానెప్పుడూ చూడలేదని, సగుతా రాయ్‌ నిజంగా చాలా స్పోర్టివ్‌ పర్సన్‌ అని రవీనా టాండన్ ప్రశంసించారు. కాగా పశ్చిమ బెంగాల్‌లోని డుమ్‌ డుమ్‌ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న సగుతా రాయ్‌ గతంలో మన్మోహన్‌ సింగ్‌ కేబినెట్‌లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు.