'భారతీయుడు 2'లో మరో హీరో ??..

SMTV Desk 2019-01-18 15:31:58  Sankar, kamal hasan, Simbu, Siddharth, new movie, barateeyudu2

హైదరాబాద్, జనవరి 18: కమల్ హాసన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారతీయుడు 2 సినిమా నిర్మితమవుతోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజే మొదలైంది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సేనాపతి మనవడి పాత్రలో శింబు నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా హీరో సిద్ధార్థ్ పేరు తెరపైకి వచ్చింది. కొన్ని కారణాల వలన శింబు ఈ సినిమా చేయడానికి ఆసక్తిని చూపలేదనీ, అందువలన ఆయనకి బదులుగా సిద్ధార్థ్ ను తీసుకున్నట్టుగా సమాచారం.

అయితే నిజంగా ఈ ఛాన్స్ సిద్ధార్థ్ కి వచ్చి వుంటే, ఆయన కెరియర్ కి ఇది ఎంతో హెల్ప్ అవుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. కొన్నాళ్లుగా సిద్ధార్థ్ రేసులో పూర్తిగా వెనుకబడిపోయిన విషయం తెలిసిందే. ఇక మరో ముఖ్యమైన పాత్రలో దుల్కర్ సల్మాన్ చేస్తున్నాడు. దాదాపు 8 దేశాలలో ఈ సినిమా షూటింగును జరపనున్నారు.