సైరా కాంబినేషన్ రిపీట్ ???

SMTV Desk 2019-01-18 15:13:22  Chiranjeevi, Nayanatara, koratala siva, new movie, saira narasimha reddy

హైదరాబాద్, జనవరి 18: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమా షూటింగులో బిజీగా వున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ నాటికి పూర్తిచేసి, ఆగస్టు 15న విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. చిరంజీవి ఈ సినిమా తరువాత కొరటాల శివతో చేయనున్న సినిమాలోను కథానాయికగా నయనతారనే తీసుకోనున్నారని సమాచారం.

మొదట ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం అనుష్క .. కాజల్ .. శ్రియ .. త్రిష .. శ్రుతిహాసన్ పేర్లను పరిశీలించారట. కానీ చివరికి నయతారనే తీసుకోవడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నయనతారతో సంప్రదింపులు మొదలైపోయినట్టు సమాచారం. తెలుగు తమిళంలో నయనతారకి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆమెనే తీసుకోవాలనే బలమైన నిర్ణయంతో చిత్ర యూనిట్ ఉందట. అందువలన దాదాపుగా ఆమె ఎంపిక ఖరారైపోవచ్చని అంటున్నారు.