టీఆరెస్ తరపున ఏపీలో పోటీ...???

SMTV Desk 2019-01-18 13:32:22  TRS Party in Andhrapradesh assembly elections, Talasani srinivasyadav, Tuda chairman Narashimha yadav

తిరుమల, జనవరి 18: తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తుడా చైర్మన్ నరసింహ యాదవ్ సవాల్ విసిరారు. రాజకీయాల్లోకి రాకముందు తలసాని పరిస్థితి ఏంటో హైదరాబాద్‌ ప్రజలకు తెలుసునని, అంతేకాక టిడిపిలో చేరి తలసాని ఉన్నత పదవులు పొందారని తెలిపారు.

తలసానికి దమ్ముంటే టిఆర్‌ఎస్‌ తరఫున ఏపిలో పొటీ చెయ్యాలని సవాల్‌ విసిరారు. రాజకీయ భిక్ష పెట్టిన టిడిపిపై తలసాని విమర్శలు అనైతికమని మండిపడ్డారు. మోది డైరెక్షన్‌లో టిఆర్‌ఎస్‌ నడుస్తుందని ఆరోపించారు. జగన్‌, కేసిఆరతో కుమ్మక్కయ్యారని ఆయన అన్నారు.