భారీగా పారితోషికాన్ని పెంచేసిన దర్శకుడు..

SMTV Desk 2019-01-18 13:29:29  Anil ravipudi, Venkatesh, Varun tej, F2 Movie

హైదరాబాద్, జనవరి 18: సక్సెఫుల్ డైరెక్టర్స్ జాబితాలో ఎస్.ఎస్ రాజమౌళి .. కొరటాల శివ తరువాత స్థానంలో అనిల్ రావిపూడి కనిపిస్తున్నాడు. పటాస్ , సుప్రీమ్ , రాజా ది గ్రేట్ చిత్రాలతో అనిల్ హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్ 2 సినిమాతో మరో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అప్పటికే థియేటర్లలో బాలకృష్ణ కథానాయకుడు .. రామ్ చరణ్ విన విధేయ రామ వంటి పెద్ద సినిమాలు ఉండగా, ఈ సినిమా తనదైన శైలిలో భారీ వసూళ్లను రాబడుతూ ఉండటం విశేషం. ఈ సందర్బంగా చాలామంది నిర్మాతలు, స్టార్ హీరోలు అనిల్ రావిపూడితో సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు.

ఈ సందర్బంగా అనిల్ రావిపూడి తన డిమాండ్ కి తగినట్టుగా పారితోషికం భారీగా పెంచేసినట్టు ఫిల్మ్ నగర్లో వొక టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు వరకూ వొక్కో సినిమాకి 3 కోట్ల వరకూ తీసుకుంటూ వచ్చిన ఆయన, 5 కోట్లకి పైగా తన పారితోషికాన్ని పెంచేసినట్లుగా చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఆయన తాజా చిత్రానికి సంబంధించిన విషయాలు తెలియనున్నాయి.