ఎన్టీఆర్ భారీ విగ్రహం ఆవిష్కరణ

SMTV Desk 2019-01-18 13:18:23  NTR Death anniversar, NTR Big statue, AP CM

గుంటూర్, జనవరి 18: నేడు పముఖ సంచలన నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారి వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు గుంటూర్ జిల్లాలోని సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన 36 అడుగుల ఎన్టీఆర్‌ భారీ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. దాదాపు 50 ఎకరాల చెరువు మధ్యలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేశారు.

విగ్రహం ఏర్పాటు చేసిన చెరువుకి తారకరామ సాగరంగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల ఎన్టీఆర్ సాగర్‌లో బోటులో విహరించారు. అనంతరం చెరువు పక్కనే పది ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్క్, వావిలాల ఘాట్‌లను చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాయపాటి, మంత్రి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.