పోచారం ఇంటిపేరు ఇదేనా...!

SMTV Desk 2019-01-18 12:58:45  Pocharam srinivasreddy, Telangana assembly speaker, KCR, Village name pocharam

హైదరాబాద్, జనవరి 18: తెలంగాణ శాసనసభాపతిగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటిపేరు పోచారం కాదని, ఆయన ఇంటిపేరు పరిగె అని, స్వగ్రామం పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న గొప్ప వ్యక్తి ఆయనని అన్నారు. అంతేకాక ఈ రోజు అన్ని పేపర్లలో స్పీకర్‌గా పోచారం అని రాశారు ,అంటే అంతగా ఊరు పేరు ఇంటి పేరుగా వచ్చేంత నిస్వార్ధ సేవను అందించారని సియం కేసిఆర్‌ అన్నారు.

స్పీకర్‌గా తమరు ఎన్నికైన సందర్భంగా పోచారం గ్రామస్థులు ధన్యులయ్యారని అన్నారు. ఆయన ప్రజా జీవితంలో పరిపూర్ణ జీవితాన్ని అనుభవించారని, వినయశీలిగా, వివాద రహితుడిగా చక్కటి సేవలందించారని, వచ్చే ఫిబ్రవరి 10తో 70వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారని అన్నారు.