డేరా బాబాకు జీవిత ఖైదు..

SMTV Desk 2019-01-18 12:03:51  journalist murder case, Gurmeet Ram Raheem Singh, Dera baba, life imprisonment, CBI Special Court

పంచ్‌కుల, జనవరి 18: ఆధ్యాత్మిక గురువు గుర్మీత్‌ రాం రహీం సింగ్‌ బాబా, ఈ పేరు కంటే డేరా బాబాగా బాగా గుర్తింపు పొందాడు. ఇప్పటికే పలు కేసులలో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకి తాజాగా మరో కేసులో యావజ్జీవ శిక్ష పడింది. జర్నలిస్ట్‌ రామ్‌చందర్‌ చత్రపతి హత్య కేసులో డేరా బాబాకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. పంచ్‌కులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు డేరాబాబాతో పాటు మరో ముగ్గురికి జీవిత కారాగారం విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది.

డేరా బాబా, అతని అనుచరులు నిర్మల్‌ సింగ్, కుల్దీప్‌ సింగ్, కృష్ణలాల్‌ కలిసి హరియాణాలోని సిర్సా ఆశ్రమంలో 2002లో జర్నలిస్ట్‌ రామ్‌చందర్‌ చత్రపతిని చంపేశారు. రామ్‌చందర్‌ తన పత్రికలో డేరా బాబా ఓ మహిళను లైంగికంగా వేధించారంటూ కథనం ప్రచురించడమే ఇందుకు కారణం.