సెట్స్ పైకి 'భారతీయుడు 2'

SMTV Desk 2019-01-18 11:19:50  Sankar, 2.o, akshay kumar, kamal hasan, new movie, barateeyudu2

హైదరాబాద్, జనవరి 18: భారీ చిత్రాల దర్శకుడు శంకర్ .. విలక్షణ నటుడు కమలహాసన్ కలయికలో గతంలో వచ్చిన భారతీయుడు సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రం వచ్చి చాలా కాలమైనా, ప్రేక్షకులు దానిని ఇంకా మరిచిపోలేదు. అలాంటి ఆ సినిమాకి ఇప్పుడు దర్శకుడు శంకర్ సీక్వెల్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. 2.ఓ చిత్రం తరువాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే భారతీయుడు 2 సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను చకచకా పూర్తి చేసేశాడు. ఈ చిత్ర తొలి షెడ్యూల్ ను చెన్నైలో ప్లాన్ చేశారు.

ఈ నేపథ్యంలో ఈరోజు చెన్నైలో సినిమా రెగ్యులర్ షూటింగును మొదలు పెడుతున్నారు. తొలి షెడ్యూల్ లో కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ సరసన కథానాయికగా కాజల్ కనిపించనుంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ .. తమిళ హీరో శింబు ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. 2020 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే పక్కా ప్లానింగ్ తో శంకర్ వున్నాడు. భారతీయుడు 2 తరువాత ఇక తాను సినిమాలు చేయనని కమల్ చెప్పిన సంగతి తెలిసిందే.