ఈ సంక్రాంతి కి కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమా ??

SMTV Desk 2019-01-17 19:09:28  Venkatesh, Varun tej, F2 Movie, collections

హైదరాబాద్, జనవరి 17: ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వెంకటేష్.. వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 సినిమా ఈ నెల 12వ తేదీన విడుదలైంది. అప్పటికే థియేటర్స్ లో బాలకృష్ణ కథానాయకుడు .. రామ్ చరణ్ వినయ విధేయ రామ వున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎఫ్ 2 ను వదలడం సాహసమే అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా ఎఫ్ 2 తన జోరును కొనసాగిస్తోంది. ఈ చిత్రం విడుదలైన అన్ని ప్రాంతాల్లో భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. తొలి నాలుగు రోజుల కంటే ఎక్కువ వసూళ్లను 5వ రోజున ఈ సినిమా రాబట్టడం విశేషం.

ఈ సినిమా తొలి 4 రోజుల్లో 26 కోట్ల షేర్ ను సాధించిగా, 5వ రోజున 6.5 కోట్ల షేర్ ను వసూలు చేసింది.దీంతో 5 రోజుల్లో ఈ చిత్రం 32 కోట్లకి పైగా షేర్ ను రాబట్టింది. ఇక ఈ వారాంతంలో కొత్తగా వచ్చే సినిమాలేవీ లేవు కనుక ఈ చిత్ర వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. లాంగ్ రన్ లో ఈ సినిమా 60 కోట్ల షేర్ మార్కును అందుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.