సినీ రంగంలోకి అగ్ర హీరో తనయుడు

SMTV Desk 2019-01-17 18:24:40  Actor surya, Surya son dev, Debut movie, 2D Entertainments

చెన్నై, జనవరి 17: ప్రముఖ సంచలన నటుడు సూర్య తనయుడు దేవ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దేవ్ తో ఓ కొత్త దర్శకుడు కూడా పరిచయమవబోతున్నాడు. ఓ చిన్న పిల్లాడికి కుక్కపిల్లకి మధ్య ఉన్న అనుబంధం నేపధ్యంలో ఈ సినిమా ఉంటుందని కోలివుడ్ వర్గాల సమాచారం. సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్స్ మీద ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.





నిజానికి గతంలో ఈ సినిమా కోసం 2డి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లను పిలిపించి ఆడిషన్స్ నిర్వహించింది. ఫైనల్ గా సూర్య కుమారుడినే ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. దేవ్ తో పాటు ఈ సినిమాలో మరో ముప్పై మంది పిల్లలు నటించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికార ప్రకటన రానుంది.