మరోసారి శంకర్ సినిమాలో విలన్ గా అక్షయ్..

SMTV Desk 2019-01-17 17:31:23  Sankar, 2.o, akshay kumar, kamal hasan, new movie, indian2

హైదరాబాద్, జనవరి 17: కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన భారతీయుడు భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి దర్శకుడు శంకర్ రంగంలోకి దిగాడు. ఈ సీక్వెల్ కి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. కమల్ కథానాయకుడిగా కనిపించనున్న ఈ సినిమాలో ఆయన సరసన కాజల్ అగర్వాల్ నటించనుంది. ఈ సినిమాలో సేనాపతి మనవడి పాత్రలో శింబు కనిపించనున్నాడు.

కాగా ప్రతినాయకుడి పాత్రలో 2.ఓ లో విలన్ గా నటించిన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కనిపించే అవకాశాలు పుష్కలంగా వున్నాయనే సమాచారం. అక్షయ్ ఇప్పటికే విలన్ గా నూటికి నూరు మార్కులు కొట్టేశాడు. మరోసారి శంకర్ కాంబినేషన్లో చేయాలని ఉందనే ఉత్సాహాన్ని ఆయన అప్పుడే వ్యక్తం చేశాడు. అందువలన శంకర్ ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నాడట. విలన్ గా అక్షయ్ కుమార్ ఎంపిక దాదాపు ఖరారైపోతుందంటున్నారు. ఇక కాజల్ ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని మురిసిపోతోందట.