'మహానాయకుడు'కి రంగం సిద్ధం..

SMTV Desk 2019-01-17 17:14:12  NTR Biopic, mahanayakudu, Balakrishna, Krish, release date

హైదరాబాద్, జనవరి 17: దివంగత ఎన్టీఆర్ జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగమైన కథానాయకుడు థియేటర్లకు వచ్చింది. సంక్రాంతి కానుకగా వచ్చిన కథానాయకుడు మంచి విజయాన్ని కైవశం చేసుకుంది. ఇక నందమూరి అభిమానులందరి దృష్టి ఇప్పుడు మహానాయకుడు పై పడింది. ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం సరిపోకపోవచ్చనే ఉద్దేశంతో ఫిబ్రవరి 14వ తేదీకి విడుదలను వాయిదా వేశారు.

ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండవ భాగమైన మహానాయుడు లో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం .. ఆ ప్రయాణంలో ఆయనకి ఎదురైన పరిస్థితులను చూపించనున్నారు. మహానాయుడు లో చంద్రబాబుగా రానా .. హరికృష్ణగా కల్యాణ్ రామ్ పాత్రలు పూర్తిస్థాయిలో కనిపించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. మహానాయకుడు లో ఎన్టీఆర్ గా బాలకృష్ణ మరింత హుందాగా కనిపిస్తారనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఎంతలా మెప్పిస్తారో .. ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి మరి.