చంద్రబాబు తన ప్రసంగాన్ని మధ్యలో ఆపడానికి కారణం అదే!!

SMTV Desk 2017-07-30 14:42:18  AP CM, chandrababu naidu, Chief minister, TDP, AP CM at PI Data center opening

అమరావతి, జూలై 30: భారత్ లౌకిక దేశం అని చెప్పడం కాకుండా తనదైన శైలిలో దాని గొప్పతనాన్నిమరొసారి ఋజువు చేసి చూపించారు అయన. అక్కడ జరుగుతున్నది 600 కోట్ల రూపాయల విలువైన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కంపెనీ ప్రారంభోత్సవం. వక్తలు గొప్ప గొప్ప సందేశాలు ఇస్తున్నారు. ఇంతలో మసీదు నుంచి నమాజ్ వినిపించింది. వెంటనే తన ప్రసంగాన్ని నిలిపివేసి సర్వమతాలు సమానం అని సందేశాన్ని తెలిపారు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు. ఇది అంతా అమరావతిలో పై డేటా సెంటర్ ప్రారంభోత్సవ సభలో జరిగిన గొప్ప సంఘటన. వివరాల్లోకి వెళ్తే ప్రారంభ కర్త ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న సమయంలో పక్కనే ఉన్న మసీదు నుంచి నమాజ్ వినిపించింది. దీంతో ఆయన ప్రసంగాన్ని నిలిపివేశారు, నమాజ్ ఏడు నిమిషాల పాటు సాగగా, అంతసేపూ మైక్ ముందు మౌనంగా ఉన్నారు. విషయాన్ని అర్థం చేసుకున్న ప్రజలు కూడా నిశ్శబ్దంగా ఉండిపోయారు. నమాజ్ ముగిసిన తరువాత చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ఏ మతం మనోభావాలనైనా, అందరూ గౌరవించాలని అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలకు సభికులంతా చప్పట్లతో మద్దతు తెలిపారు.