అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని నూతన ఎమ్మెల్యేలు

SMTV Desk 2019-01-17 13:37:35  Telangana assembly, New MLA s, Raja singh, Sandra venkata veeraiah

హైదరాబాద్, జనవరి 17: తెలంగాణ రాష్ట్రంలో నేడు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన ఇద్దరు నూతన ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఈ ప్రమాణ స్వీకారాలను ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ చేయిస్తున్నారు.

అయితే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, నగరంలోని గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ ఇరువురు నేటి సభా సమావేశాలకు హాజరుకాలేదు. సర్పంచ్ ఎన్నికల బిజీ వల్ల రాలేకపోతున్నట్లు సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. స్పీకర్ ఎన్నిక పూర్తున తర్వాతే ప్రమాణం చేస్తానని రాజాసింగ్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.