నెటిజన్ ప్రశ్నకు పాయల్ ఘాటైన సమాధానం!

SMTV Desk 2019-01-17 13:13:01  Payal rajput, Rx100, fan quation

హైదరాబాద్, జనవరి 17: పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంలో తన హాట్ అందాలతో, లిప్ కిస్ సీన్లతో తొలి సినిమాతోనే యువతను బాగా ఆకట్టుకుంది. కాగా పాయల్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా, తన అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూవుంటుంది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని "మీ బికినీ ఫోటో ఉంటే పోస్ట్‌ చేయండి" అనగా, సమాధానం ఇస్తూ, తాను బరువు తగ్గడానికి వ్యాయామం చేస్తున్నానని, మంచి శరీరాకృతి వచ్చిన తరువాత తప్పకుండా బికినీ ఫోటోలు పోస్ట్ చేస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

అనంతరం మరికొందరి ప్రశ్నలకు జవాబిస్తూ, తన తల్లితో కలిసి ఆర్ఎక్స్ 100 చిత్రం చూస్తుంటే ఇబ్బందిగా అనిపించిందని, కానీ ఇదంతా నీ వృత్తిలో భాగమేనంటూ అమ్మ అండగా నిలిచిందని అంది. తన ప్రాధాన్యత తొలుత కుటుంబానికేనని, ఆపైనే కెరీర్ అని, సాంబార్ రైస్ ను ఇష్టంగా తింటానని చెప్పింది.