గాంధీ శాంతి బహుమతి విజేతల పేర్లు ఖరారు..

SMTV Desk 2019-01-17 12:55:46  Mahatama Gandhi, awards list, ISRO, Sulabh International, akshaya patra Foundation, central government

న్యూఢిల్లీ, జనవరి 17: దేశంలో ప్రతిష్టాత్మకమైన మహాత్మా గాంధీ శాంతి బహుమతుల విజేతల పేర్లను 2015 నుంచి 2018 వరకు నాలుగేళ్ల కాలానికి గాను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. చివరిగా 2014లో ఈ పురస్కారాన్ని ఇస్రో సంస్థ కు ప్రదానం చేశారు. 2015 నుంచి ఎవరికీ ఇవ్వలేదు. గాంధీ సిద్ధాంతాలు, పద్ధతుల ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పు కోసం కృషిచేసే వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులు ఇస్తారు. తాజాగా ప్రకటించిన అవార్డుల్లో 2015వ సంవత్సర విజేతగా కన్యాకుమారికి చెందిన వివేకానంద కేంద్రను ఎంపిక చేశారు.

2016 ఏడాదికి పాకీ పని చేసే వారికి విముక్తి కల్పించినందుకు సులభ్‌ ఇంటర్నేషనల్‌కు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందిస్తున్నందుకు అక్షయపాత్ర ఫౌండేషన్‌కు కలిపి గాంధీ శాంతి అవార్డును ప్రకటించారు. 2017కి ఏకై అభియాన్‌ ట్రస్ట్‌ను, 2018కి కుష్టు వ్యాధి నిర్మూలన కోసం డబ్ల్యూహెచ్‌వో సౌహార్ద్ర రాయబారిగా ఉన్న యోహీ ససకవాకు అవార్డులను ప్రకటించారు. ఈ బహుమతి కింద కోటి రూపాయలతో పాటు ప్రశంసాపత్రం ఇస్తారు.