ఏపీ రాజకీయాల్లో నందమూరి సుహాసిని..???

SMTV Desk 2019-01-17 12:14:09  Nandamoori suhasini, TDP, Andhrapradesh politics enter to nandamoori suhasini, Chandrababu

తెనాలి, జనవరి 17: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయ పాలైన నందమూరి సుహాసిని ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా పాల్గొనేందుకు ఆశక్తి చూపుతోంది. ఆమె భుధవారం గుంటూర్ జిల్లా తెనాలిలో చేసిన ప్రకటన ఆ విషయాన్ని పట్టిస్తింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని సుహాసిని అన్నారు. సంక్రాంతి సందర్భంగా తెనాలి వచ్చి ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ విజయానికి తమ కుటుంబం శక్తి వంచన లేకుండా సహకరిస్తుందని సుహాసిని చెప్పారు.