గన్‌పార్క్ వద్ద నివాళులర్పించిన కేసీఆర్

SMTV Desk 2019-01-17 11:47:45  KCR, Gun park, Assembly, Telangana state Chief minister

హైదరాబాద్, జనవరి 17: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా రెండో సారి అసెంబ్లీ లో కోలువదీరనున్న సందర్భంగా కేసీఆర్ కాసేపటిక్రితం గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి చేరుకోనున్నారు.

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావ్, ఈటల రాజేందర్, పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు నివాళులర్పించారు.