నేడు శాసనసభాపక్ష నేత ఎన్నిక

SMTV Desk 2019-01-17 11:22:13  Telangana assembly meetings, Congress party, Uttam kumar reddy, Kuntiya

హైదరాబాద్, జనవరి 17: తెలంగాణలో నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన 19 మందిని ఈ రోజు ఉదయం అసెంబ్లీ కమిటీ హాలులో సమావేశమయ్యి శాశానసభాపక్ష నేతని ఎన్నుకొంటారు. దీనికోసం కాంగ్రెస్‌కోర్ కమిటీ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబీర్ ఆలీ, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్-ఛార్జ్ కుంతియా, ఏఐసిసి కార్యదర్శులు సలీం అహ్మద్, బోస్ రాజు, శ్రీనివాసన్, వీహెచ్, వంశీచంద్ రెడ్డి, సంపత్‌లు రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్ తదితరులు నిన్న రాత్రి గోల్కొండ హోటల్లో సమావేశమయ్యి చర్చించారు.

డిల్లీ నుంచి వచ్చిన ఏఐసీసీ పరిశీలకుడు కెసి వేణుగోపాల్ అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తరువాత శాసనసభాపక్ష నేత పేరును సూచించినట్లు సమాచారం. ఆయన సూచించిన ఎమ్మెల్యేనే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోబోతున్నారు.