నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

SMTV Desk 2019-01-17 11:09:01  Telangana assembly elections, KCR, Mumtaz ahmed khan, Governor Narashimahan, Telangana assembly season

హైదరాబాద్, జనవరి 17: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలి సారిగా అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ సభ సమావేశాలు నేటి నుండి ఈ నెల 20 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాలకు అధ్యక్షత వహించేందుకు బుధవారం రాజ్‌భవన్‌లో సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు. దీంతో ఈ రోజు ఉదయం 11.30 గంటలకు ముంతాజ్ అహ్మద్‌ఖాన్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశమవుతుంది. ఆ తర్వాత ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ప్రమాణం చేయిస్తారు. ముందుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, తర్వాత మహిళాసభ్యులు ప్రమాణం స్వీకరిస్తారు.

ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఆల్ఫాబేటికల్ లెటర్స్ ఆధారంగా మిగతాసభ్యులు ప్రమాణస్వీకారం, జూబ్లీహాల్‌లో ప్రభుత్వం అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు గురువారం నామినేషన్లు శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు నోటిఫికేషన్ జారీ చేస్తారు. స్పీకర్‌గా పోటీచేయాలనుకొనే సభ్యులు గురువారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. 18న స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు.