చెన్నై సిల్క్స్ లో భారీ అగ్నిప్రమాదం

SMTV Desk 2017-06-01 11:57:42  the chennai silks, mega cloth show room, chennai t-nagar

చెన్నై, జూన్ 1 : భారీ అగ్ని ప్రమాదం చెన్నై నగరాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. చెన్నై టి-నగర్ లోని ప్రధాన కేంద్రంలో ఉన్న ది చెన్నై సిల్క్స్ మెగా క్లాత్ షోరూం లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్కూట్ మూలంగా అగ్ని ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకున్న అగ్నిప్రమాదం గురువారం తెల్లవారు జాము వరకు కూడా అదుపులోకి రాకుండా అగ్నికీలలు ఎగసిపడుతునే ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున ఆ షోరూం పై అంతస్థుల్లో నుండి దట్టమైన పోగలు, మంటలు వేలువడుతుండడంతో ఆ పరిసర ప్రాంతాల వారు పోలిసులకు, అగ్నిమాపక శాఖకు, యాజమాన్యానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ ఐదు అగ్నిమాపక శకటాలతో అక్కడకు చేరుకోని మంటలనార్పే ప్రయత్నాలను ప్రారంభించారు. అయితే ఎటు అదుపులోకి రాకుండా అగ్నికీలలు మరింత ఎగిసి పడుతుండడంతో 60 అగ్నిమాపక శకటాలను సహాయక చర్యలకు తరలించారు. అగ్ని ప్రమాదం మూలంగా పై అంతస్థులు కుప్పకూలడం ప్రారంభం అవడంతో భారీ శబ్దాలు చోటు చేసుకున్నాయి.అయితే ఎనమిదో అంతస్థులో ఉన్న 12 మంది సిబ్బందిని అగ్నిమాపక శాఖ వారు రక్షించి..సురక్షితంగా తరలించారు. షోరూంలో పెద్దఎత్తున వస్త్రాలు, కలప అలంకరణ సామాగ్రి ఉండడంతో మంటలు ఉధృతంగా వ్యాపిస్తున్నాయి. కోట్లాది రూపాయల నష్టం ఉంటుందని అంచనా..