చరణ్ అలాంటి వాడు : స్నేహ

SMTV Desk 2019-01-16 11:53:01  Ram Charan, Vinaya Vidheya Rama, Sneha, Ali to saradaga

హైదరాబాద్, జనవరి 16: అందంలోను.. అభినయంలోను స్నేహా మంచి మార్కులు సంపాదించుకుంది. అలాగే నటనలో కథానాయికగా ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్ళి తర్వాత ఆమె సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చింది. అలాంటి స్నేహా రీ ఎంట్రీ సక్సెస్ ఫుల్ గా సాగిపోయింది. తాజాగా ఆమె ఆలీతో సరదాగా కార్యక్రమంలో మాట్లాడుతూ చరణ్ గురించి ప్రస్తావించారు. వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ వదినగా నటించాను. మెగాస్టార్ తనయుడు .. ఎలా వుంటారో ఏంటోనని ఫస్టు డే అనుకున్నాను.

కానీ చరణ్ షూటింగ్ లో చాలా సింపుల్ గా ఉంటాడు .. అందరితోను కలిసిపోతాడు. చిన్న ఆర్టిస్టులు.. పెద్ద ఆర్టిస్టులు అనే తేడాను ఆయన ఎంతమాత్రం చూపించడు. అందరితో చాలా గౌరవంగా మాట్లాడతాడు. ఆయనలోని ఆ మంచి లక్షణం నాకు బాగా నచ్చింది. ఆయన చాలా గొప్ప డాన్సర్ .. డాన్స్ లో ఆ జోష్ ఆయనకి చిరంజీవి గారి నుంచే వచ్చి ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.