కమల్ హాసన్ లుక్ అదిరిపోయింది

SMTV Desk 2019-01-16 10:15:29  Kamal Haasan, Indian 2, Shanker

చెన్నై జనవరి 16: తమిళ్ సూపర్ స్టార్ కమల్‌హాసన్‌ నటిస్తున్న చిత్రం “భారతీయడు-2”. 1996లో విడుదలై సంచలనం సృష్టించిన “భారతీయుడు” సినిమాకు 22 ఏళ్ల తర్వాత సీక్వెల్‌గా వస్తోన్న చిత్రమిది. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో కమల్‌‌ సరసన కాజల్‌ నటిస్తున్నారు. అనిరుధ్‌ సినిమాకు బాణీలు అందిస్తున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను శంకర్‌ విడుదల చేశారు. ఇందులో కమల్‌ తన వర్మ కళను ప్రదర్శిస్తూ కనిపించారు. జనవరి 18 నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.

తొలుత ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను డిసెంబరు 14న హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు వార్తలు వచ్చాయి. రెండో షెడ్యూల్‌ చెన్నైలో జరగనుందని చెప్పుకొచ్చారు. శంకర్‌ “2.ఓ” సూపర్ హిట్ తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్‌ హాసన్‌కు మరోపక్క “శభాష్‌ నాయుడు” సినిమాలో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల్ని కమలే‌ చూసుకుంటున్నారు. రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శ్రుతిహాసన్‌ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది