ప్రభాస్‌కి శ్రద్ధా గిఫ్ట్‌.

SMTV Desk 2019-01-15 12:33:29  prabhas, saaho,

హైదరాబాద్, జనవరి 15: ‘సాహో మూవీబృందానికి బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు. యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో చిత్రీకరణ సమయంలో ప్రభాస్‌, చిత్రబృందం కలిసి శ్రద్ధాను చాలా బాగా చూసుకున్నారు. పసందైన తెలుగు వంటకాలను శ్రద్ధాకు రుచి చూపించారు. వంటకాల ఫొటోలను ఇదివరకు శ్రద్ధా కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.


అయితే ఇప్పుడు శ్రద్ధా వంతు వచ్చింది. తనను ఇంత బాగా చూస్తున్న ప్రభాస్‌ను ‘సాహో చిత్రబృందాన్ని సర్‌ప్రైజ్‌ చేయాలనుకున్నారు. ఇందుకోసం తిల్‌గుల్‌ లడ్డూలు, ఇంట్లో తయారు చేసిన కిచిడీ పంపించారట. మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం మకర సంక్రాంతి పండుగ నేపథ్యంలో తిల్‌గుల్‌ లడ్డూలను పంచుకుని పండుగను జరుపుకొంటారట. అలా ప్రభాస్‌ తనకు తెలుగు వంటకాలను రుచి చూపిస్తే.. శ్రద్ధా మహారాష్ట్ర వంటకాలను రుచి చూపించారు. సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ‘సాహో చిత్రం ఆగస్ట్‌ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.