షూటింగ్‌ ప్రారంభించేసిన రాజమౌళి

SMTV Desk 2019-01-15 12:23:45  RRR, Rajamouli, ram charan

హైదరాబాద్, జనవరి 15: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ హీరోలుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రారంభించిన భారీ మల్టీస్టారర్‌ మూవీ వొక షెడ్యూల్ పూర్తిచేసుకుంది. మధ్యలో కుమారుడి పెళ్లి ఉండటంతో ఈ సినిమాకి కాస్త బ్రేక్ ఇచ్చిన రాజమౌళి హడావుడి మొత్తం ముగియడంతో మళ్ళీ చిత్రీకరణ మొదలుపెట్టనున్నారు. ఈ నెల 21 నుండి కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ప్రెజెంట్ చరణ్ ప్రమోషన్లలో బిజీగా ఉండగా తారక్ వర్కవుట్స్ చేస్తూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. మొదటి షెడ్యూల్ ను త్వరగానే ముగించిన జక్కన్న ఈ రెండవ షెడ్యూల్ ను మాత్రం ఎక్కువ రోజులే కొనసాగిస్తాడని తెలుస్తోంది.