మహిళలను కించపరిచే సంస్కృతి వైసీపీదే...!!!

SMTV Desk 2019-01-14 17:08:31  YS Sharmila, TDP Minister, Paritala sunitha, YSRCP

అమరావతి, జనవరి 14: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేసిన వ్యాఖ్యలపై చాలా ఘాటుగా స్పందించారు టీడీపీ మంత్రి పరిటాల సునీత. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళలను కించపరిచే సంస్కృతి వైఎస్‌ఆర్‌సిపిదేనని, స్త్రీలను తోబుట్టువులుగా భావించే పార్టీ టిడిపి అని అన్నారు. మహిళా ఎమ్మెల్యేలను సైతం కంటతడి పెట్టిన వ్యక్తి జగన్‌ అని ఆరోపించారు.

షర్మిళతో పాటు ఏ మహిళపై ఇలాంటి ప్రచారం జరిగినా టిడిపి తీవ్రంగా ఖండిస్తుందని సునీత పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమన్నారు. సిద్ధాంతాలు, విలువలకు కట్టుబడి పనిచేసే పార్టీ టిడిపి అని అన్నారు. మహిళా ఐఏఎస్‌ అధికారులు, మహిళా మంత్రులను జైలుపాలు చేసిన చరిత్ర జగన్‌దేనని పరిటాల సునీత ఆరొపించారు.