ఒకే వేదికపై సౌత్ స్టార్స్...

SMTV Desk 2019-01-14 16:49:26  TSR Awards, Chiranjeevi, Nandamuri balakrishna, Venkatesh, Nagarjuna, Rajinikanth, Surya, Vikram

హైదరాబాద్, జనవరి 14: ఫిబ్రవరి 17 న వైజాగ్ వేదికగా జరగనున్న టీఎస్ఆర్ అవార్డ్స్ వేడుకకు సౌత్ బిగ్ స్టార్స్ హాజరుకానున్నారు. ఈ ఈవెంట్ లో వొకే వేదికపై స్టార్ హీరోలు కనిపించనున్నారు. వొకే ఫ్రేమ్ లో చాలా రోజుల తరువాత సౌత్ హీరోలు కనిపించడానికి సిద్దమవుతుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి - నందమూరి బాలకృష్ణ - నాగార్జున - వెంకటేష్ లు వేడుకలో పాల్గొంటుండగా వారితో పాటు కోలీవుడ్ హీరోలు రజినీకాంత్ - సూర్య - విక్రమ్ లు వొకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు.

సీనియర్ రాజకీయ నాయకుడు సినీ నిర్మాత టి.సుబ్బిరామి రెడ్డి ఆధ్వర్యంలో ఇవ్వనున్న ఈ TSR నేషనల్ అవార్డ్స్ సందర్బంగా కోలీవుడ్ - టాలీవుడ్ హీరోలు కెమెరా కంట పడితే సింగిల్ ఫ్రేమ్ లో కనిపిస్తే అభిమానులకు పండగే. అయితే మెగాస్టార్ - బాలకృష్ణ లు ఎదురుపడితే ఎలా ఉంటుందో చూడాలి.