అల్లూరి సీతారామరాజును ఇంటర్వ్యూ చేసిన గొప్పతనం

SMTV Desk 2017-07-30 11:46:51  andhrapatrika, andhrapatrika relaunching, venkaiah naidu, venkaiah naidu at andhrapatrika relaunch event

విజయవాడ, జూలై 30: 19వ శతాబ్దంలో ప్రజలను ఎంతగానో మేల్కొలిపిన పత్రిక అంటే వెంటనే గుర్తు వచ్చేది అలనాటి ఆంధ్రపత్రిక. ఈ దినపత్రికను 1991లో కొన్ని తప్పనిసరి కారణాల వల్ల మూసివేయడం జరిగింది. అయితే ఈ పత్రిక మళ్లీ జనాలను చైతన్య పరుచనుంది. ఇందులో భాగంగా శనివారం విజయవాడ ఐవీప్యాలెస్‌లో ఈ దినపత్రిక కృష్ణా జిల్లా ఎడిషన్‌ను ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికలు స్వేచ్ఛ, హక్కులతో పాటు బాధ్యతలను గుర్తుంచుకోవాలన్నారు. పత్రికలు వాస్తవాలకు దగ్గరగా, సంచలనాలకు దూరంగా ఉండాలని ఆయన తెలిపారు. కాగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును ఇంటర్వ్యూ చేసిన గొప్పతనం ఆంధ్రపత్రికదే అని ఆయన కొనియాడారు.