రాజస్థాన్ రాయల్స్ కి కొత్త కోచ్ గా ప్యాడీ ఆప్టన్

SMTV Desk 2019-01-14 16:08:13  IPL 2019, Rajasthna royals new couch paddy upton, Mental conditioning couch

ముంబై, జనవరి 14: ఐపీఎల్ తొలి ఎడిషన్ విజేత రాయల్స్ కొత్త కోచ్ గా భారత మాజీ మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ ను ఎంచుకుంది. గతంలోనూ ఆయన నాలుగుసార్లు రాజస్థాన్‌కు కోచ్‌గా పనిచేశాడు. ఆయన శిక్షణలో 2013లో ఆ జట్టు సెమీస్‌ చేరుకుంది. అదే ఏడాదిలో శ్రీశాంత్‌ సహా ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేయడంతో జట్టు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అప్పుడే ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20 ఫైనల్‌కు చేరుకుంది. ఆప్ఘన్‌ కోచింగ్‌లో మంచి అనుభవం ఉంది.

ఐపిఎల్‌, బిగ్‌బాష్‌, పిఎస్‌ల వంటి లీగుల్లో జట్లకు మార్గ నిర్ధేశకుడిగా ఉన్నారు. బిగ్‌బాష్‌లో సిడ్నీ థండర్స్‌కు నాలుగేళ్లు కోచ్‌గా ఉండి 2016లో విజేతగా నిలిపారు. అప్పటి కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌తో కలిసి టీమిండియాకు మెంటల్‌ కండీషనింగ్‌ కోచ్‌గా పనిచేశాడు. వారి ఆధ్వర్యంలోనే భారత్‌ 2011 ప్రపంచకప్‌ గెలిచింది. ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌ల అగ్రస్థానంలో నిలిచింది. 2011-14 వరకు దక్షిణాఫ్రికా పర్ఫామెన్స్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. 2012లో ఆ జట్టు టెస్టు, వన్డే, టీ20ల్లో వొకేసారి అగ్రస్థానంలో నిలిచింది.