'మజిలీ' సెకండ్ లుక్...

SMTV Desk 2019-01-14 15:51:40  Akkineni naga chaithanya, Akkineni Samantha ruth prabhu, Majili, Shiva nirvana

హైదరాబాద్, జనవరి 14: అక్కినేని దంపతులు నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రం మజిలీ . ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను గత నెల 29 న విడుదల చేయగా సంక్రాంతి సందర్భంగా సెకండ్ లుక్ ని చిత్ర బృందం విడుదల చేశారు. ఇందులో నాగ చైతన్య క్రికెటర్ గా కనిపిస్తుండగా.. మరో హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ చైతుని కౌగిలించుకొని కనబడింది.

నిజానికి ఈ సినిమా కథ పెళ్లైన జంట మధ్య వచ్చే పొరపచ్చాల నేపధ్యంలో సాగుతుంది. ఈ పోస్టర్ ని బట్టి పెళ్లికి ముందు హీరో మరో అమ్మాయితో నడిపిన ప్రేమాయణాన్ని కూడా చూపించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను ఏప్రిల్ 5నప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో అయినా చైతు సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి! కాగా ఈ సినిమా పోస్టర్ ని భార్యాభర్తలిద్దరూ తమ ట్విట్టర్ ఖతాలో పోస్ట్ చేశారు.