పాడి రైతులతో బాబు సమావేశం

SMTV Desk 2019-01-14 14:55:54  Andhrapradesh Chief minister, Chandrababu, Heritage plant formers

చిత్తూర్, జనవరి 14: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం హెరిటేజ్‌ ప్లాంట్‌లో పాడి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్ర బాబు మాట్లాడుతూ 26 ఏళ్లుగా రైతులకు సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. అనంతరం హెరిటేజ్‌ సంస్థను చంద్రబాబు అభినందించారు.

సంస్థ అభివృద్ధికి భువనేశ్వరి నిర్విరామంగా పనిచేస్తుందని, రాజకీయాలతో వ్యాపారం ముడిపడకుండా కుటుంబానికి హెరిటేజ్‌ బాధ్యతలు అప్పగించానని బాబు తెలిపారు. రైతుల సహకారంతో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు తెలిపారు.