భారత్, చైనా సరిహద్దుల మధ్య రోడ్డు నిర్మాణం

SMTV Desk 2019-01-14 11:49:44  India-china Boarders, Road way, Indian government

న్యూ ఢిల్లీ, జనవరి 14: భారత్ చైనా సరిహద్దుల్లో 44 కీలకమైన రోడ్ల నిర్మాణానికి భారత సర్కార్ సన్నాహాలు చేస్తోంది. సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, రాజస్తాన్ సరిహద్దుల్లోని పాకిస్తాన్ వెంబడి 2100 కిలోమీటర్ల రోడ్లను నిర్మించాలని నిర్ణయించింది. అలాగే భారత్‌ చైనా సరిహద్దు వెంబడి 44 వ్యూహాత్మక రోడ్లను నిర్మిస్తోంది. కేంద్ర ప్రజాపనులశాఖ నివేదికను అనుసరించిచూస్తే మొత్తం భారత్‌ చైనా వెంబడి సైనికదళాల రాకపోకలకు వీలుగా రోడ్లను నిర్మించాలని ఆదేశించిందని వెల్లడించింది. భారత్‌ చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖవెంబడి నాలుగువేల కిలోమీటర్ల నిడివిపొడవునా రోడ్లనిర్మాణంచేయాల్సి ఉంటుంది. ఈ రెండుదేశాలమధ్య జమ్ముకాశ్మీర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలున్నాయి. భారత్‌ సరిహద్దులవెంబడిప్రాజెక్టుల నిర్మాణానికి చైనా ప్రాధాన్యం ఇస్తుండటంతో భారత్‌ కూడా అందుకు ధీటుగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. డోక్లాం ట్రైజంక్షన్‌వద్ద 2017లో 73 రోజులపాటు సైనికప్రతిష్టంభన తర్వాత ఆప్రాంతంలోరోడ్లనిర్మాణం చేపడుతోంది. అదే ఏడాది ఆగస్టు 28వ తేదీ ప్రతిష్టంభనకు తెరపడింది.

చైనా రోడ్లనిర్మాణాన్ని నిలిపివేస్తామని అంగీకరించడంతో భారత్‌ తన సైనిక బలగాలనుసైతం ఉపసంహరించుకుంది. 44 వ్యూహాత్మక రోడ్ల నిర్మాణానికి సుమారు రూ.21వేల కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. ఐదురాష్ట్రాలపరిధిలో ఈరోడ్లు నిర్మించాల్సిఉంది. జమ్ముకాశ్మీర్‌, హిమాచల్‌రపదేశ్‌, ఉత్తరాఖండ్‌, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని సరిహద్దుల్లో భారీప్రాజెక్టును చేపడుతోంది. మొత్తవం సమగ్ర నివేదికలను పరిశీలిస్తే రూ.21,040 కోట్ల ఖర్చవుతుంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన రక్షణవ్యవహారాలకమిటీ ఈ నివేదికలకు ఆమోదం తెలిపింది. మరో 5400 కోట్ల వ్యయంతో రాజస్థాన్‌, పంజాబ్‌ల వెంబడి ఉన్న ఇండోపాకిస్తాన్‌ సరిహద్దు వెంబడి రోడ్లనిర్మాణంచేపడుతున్నది. రాజస్థాన్‌లో మొత్తం 533 కిలోమీటర్లమేర చిన్నరోడ్లు, 482 కిలోమీటర్లమేర తారురోడ్లు నిర్మిస్తున్నారు. ఇందుకు రూ.3700 కోట్లు ఖర్చుచేస్తున్నారు. అలాగే పంజాబ్‌లోరోడ్లనిర్మాణానికి 1750 కోట్లు ఖర్చు అవుతుంది. భారత్‌ సరిహద్దు నాలుగురాష్ట్రాలగుండా వెళుతోంది. జమ్ముకాశ్మీర్‌ 1225 కిలోమీటర్లు, వాస్తవాధీనరేఖ 740 కిలోమీటర్లు, రాజస్థాన్‌ 1037 కిలోమీటర్లు, పంజాబ్‌ 553 కిలోమీటర్లు, గుజరాత్‌ 508 కిలోమీటర్లమేర సరిహద్దు నిలిచింది.