ఒకే విడతగా రైతురుణమాఫీ అమలు

SMTV Desk 2019-01-14 11:35:22  Chief Minister Kumaraswamy, Bangalore, BJP, Congress partyJDS

బెంగుళూరు, జనవరి 14: రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి రైతులకు రుణమాఫీలపై తీపి కబురందించారు. తాను అధికారంలోకి వచ్చేముందు ఎన్నికల హామీ ప్రకారం రైతుల రుణమాఫీని బడ్జెట్ లోనే భరిస్తామని ప్రకటించారు. అంతేకాక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46వేల కోట్లమేర రైతు రుణమాఫీ జరగాల్సి ఉందని, బిజెపి నాయకత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణలపై అపోహలు వద్దని ఆయన రైతులకు సూచించారు. బిజెపి నాయకత్వం ఇటీవలే కేవలం కొద్దిమంది రైతులకు మాత్రమే లాల్లిపాప్‌ను అమలు చేసిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ జెడిఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలోని బడ్జెట్‌పరంగానే ఈ హామీ పూర్తిచేస్తామని ప్రకటించారు. వచ్చేనెల 8వ తేదీ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. వొకే విడతగా రైతురుణమాఫీ అమలవుతుందని, ఇందుకు సంబంధించి బడ్జెట్‌కేటాయింపులుచేస్తామన్నారు. నాలుగుదశల్లో పూర్తిచేసేందుకు భిన్నంగా వొకేసారి అమలుకు సిద్ధం అవుతున్నట్లు వెల్లడించారు. రైతురుణమాఫీపై రాష్ట్ర, కేంద్ర బిజెపి నాయకులు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. అలాగే కేంద్ర మంత్రులు కూడా బిజెపి జాతీయ మండలి సమావేశాల్లో రైతు రుణమాఫీని ప్రకటించిన ప్రభుత్వం ఇపుడు బ్యాంకర్లు నోటీసులు పంపిస్తుంటే చూస్తూ కూర్చుందని విమర్శించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల రుణాలు రికవరీకి బ్యాంకర్లు ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం నోరుమెదపడంలేదని అన్నారు.

కుమారస్వా మి మాట్లాడుతూ నోటీసులు జాతీయ బ్యాంకులే జారీచేసాయని, ఇవి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని పేర్కొన్నారు. బిజెపి నాయకుల మనస్తత్వం, వారి అవగాహన ఏపాటితో ఇపుడు అర్ధం అవుతుందని ఆయన ఎద్దేవా చేసారు. రైతు ఆందోళన, సమస్యలను పరిష్కరించడాన్ని ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారో ఇదే నిదర్శనమని కుమారస్వామి పేర్కొన్నారు. 2019-20 సంవత్సరానికి గాను తాను వచ్చేనెల 8వ తేదీ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెడతానని అన్నారు. నాలుగుదశల్లో కాకుండా తాము వొకే విడతగా మాఫీచేస్తామని కుమారస్వామి వెల్లడించారు. వచ్చే బడ్జెట్‌లోనే ఇందుకు సంబంధించిన కసరత్తులు పూర్తి చేసామన్నారు. నాలుగేళ్లు ఎట్టిపరిస్థితుల్లోను తీసుకోనని, ఇదే కేంద్ర బిజెపి నాయకులు గుర్తుంచుకోవాలని సూచించారు. ఆర్ధిక సంతులన చట్టం నిబంధనలు ఉల్లంఘించకుండా నిధులు కేటాయించి మరీ వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రైతు రుణమాఫీని అమలుచేస్తానని వెల్లడించారు. మొత్తంరూ.46వేల కోట్లు వొకేవిడతగా విడుదలచేసి చూపిస్తానని కుమారస్వామి స్పష్టంచేసారు. రాష్ట్రంలోని 1.70 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతుందని, ఇప్పటికే 900 కోట్లు విడుదలచేసామని, జులైలో తాను బడ్జెట్‌లోనే ప్రతిపాదించానన్నారు. తొమ్మిదివేల కోట్లు ఇప్పటికే రైతురుణమాఫీకి కేటాయించామన్నారు. జనవరి 31వ తేదీనాటికి ర11-12 లక్షలమంది రైతులకు రుణమాఫీ ఉపశమనం కలుగుతుందని వెల్లడించారు. యుపిఎ ప్రభుత్వం గతంలో రూ.70వేల కోట్లు కేటాయించిందన్నారు. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోకూడా రైతురుణమాఫీ అమలయిందని గుర్తుచేసారు.