టోల్ ప్లాజాల తీరుపై సర్కార్ సీరియస్

SMTV Desk 2019-01-13 19:00:28  Tollgate Breaks government rules, Collect tax, State governments

విజయవాడ, జనవరి 13: సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టోల్ ప్లాజాల వద్ద ట్యాక్స్ వసూల్ చేయకూడదని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని టోల్ ప్లాజాల వద్ద ప్రభుత్వ నిర్ణయాన్ని ఖాతరు చెయ్యకుండా వారికీ ఇష్టమొచ్చినట్లుగా ట్యాక్స్ వసూల్ చేస్తున్నారు. అయితే ఏపీ సర్కార్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొంది.

స్థానిక పోలీసుల సహాయంతో టోల్ ఫీజు వసూలు చేయకుండా వాహనాలను పంపించివేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు కీసర టోల్‌గేట్ వద్ద స్థానిక ఎస్ఐ ఆధ్వర్యంలో వాహనాలను పంపించివేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని టోల్ గేట్ల వద్ద ఇదే పద్దతిని అమలు చేయాలని కూడ ఏపీ సర్కార్ భావిస్తోంది.