ఢిల్లీలో సంక్రాంతి సంబరాలు

SMTV Desk 2019-01-13 18:37:46  Sankranti Celebrations Started at AP Bhavan in Delhi, Sankranthi, AP Bhavan, New delhi

న్యూ ఢిల్లీ, జనవరి 13: రాజధానిలోని ఏపీ భవన్ లో సంక్రాంతి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిన్న ఉదయం నుండే ఏపీ భవన్లో సంక్రాంతి సంబరాలు మొదలు కాగా నిన్న పాట కచ్చేరీతో కోలాహలంగా మారింది. ఇక ఈరోజు కూచిపూడి నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలతో భవన్ పరిసరాలన్నీ సందడిగా మారాయి.

ఢిల్లీలోని తెలుగు ప్రజలు సాంస్కృతిక కార్యక్రమాలను చూసేందుకు ఏపీ భవన్ కు రాగా టీటీడీ, మంగళగిరి చేనేత చీరలు, తాపేశ్వరం ఖాజా, విజయవాడ తెలుగు పచ్చళ్ళు, మచిలీపట్నం గోల్డ్, ఆప్కో వస్త్రాలతో కౌంటర్లు ఏర్పాటు చేశారు.