22 రోజులు పూర్తిచేసుకున్న అమెరికా షట్ డౌన్

SMTV Desk 2019-01-13 16:34:09  America shutdown, Donald trump, Mexico boarder

వాషింగ్టన్, జనవరి 13: గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న అమెరికా షట్ డౌన్ నేటితో 22 రోజులు పూర్తి చేసుకుంది. మెక్సికో సరిహద్దుగోడకు నిధుల మంజూరుపై రిపబ్లికన్లు,డెమొక్రాట్లమధ్య నెలకొన్న వివాదంతో ఏర్పడిన అమెరికా షట్ డౌన్ స్పష్టంచేస్తున్నాయి. మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి 5.7 బిలియన్‌ డాలర్లను మంజూరుకు ప్రవేశపెట్టిన ట్రంప్‌ ప్రతిపాదనలను డెమొక్రాట్లు తిరస్కరించిన సంగతి తెలిసిందే.

దీనితో అత్యవసరంగా షట్‌డౌన్‌కు దారి తీయడంలో అమెరికాలో ఇపుడు ఎనిమిది లక్షలమందికిపైగా ఫెడరల్‌ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేనిపరిస్థితినెలకొంది. ప్రస్తుతం మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణం ఇపుడు ట్రంప్‌ను మరింత మంకుపట్టుదిశగా నడిపిస్తుండటంతో ఈ వ్యవహారానికి సంబంధంలేని శాఖలుసైతం ఇపుడు బిల్లులసమస్యలు ఎదుర్కొంటున్నాయి.