హైకోర్టును ఆశ్ర‌యించిన రాజీవ్ గాంధీ హంతకురాలు

SMTV Desk 2017-07-28 19:01:48  rajiv gandhi, nalini sriharan, madras high court,

జూలై 28: న‌ళిని శ్రీహ‌ర‌న్‌, గ‌త 26 సంవ‌త్స‌రాలుగా రాజీవ్ గాంధీ హ‌త్య కేసులో జీవిత ఖైదీ గా శిక్ష అనుభవిస్తూ ఉంది. తాజాగా ఆమె త‌న కూతురు పెళ్లి కోసం సాధార‌ణ‌ సెల‌వు కోరుతూ మ‌ద్రాస్‌ హైకోర్టును ఆశ్ర‌యించింది. ఈ సందర్బంగా ఆమె హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. శిక్ష అనుభవిస్తున్న ఆమెకు ప్ర‌తి రెండు సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి నెల రోజుల సాధార‌ణ సెల‌వు మంజూరు చేయాలి. కానీ ఇంత‌వ‌ర‌కు ఆమెకు ఎలాంటి సెల‌వు ఇవ్వ‌లేద‌ని, లండ‌న్‌లో నివ‌సిస్తున్న త‌న కూతురు హ‌రిత్ర‌న్ పెళ్లి కోసం 2016 , 6 నెల‌లు సెల‌వు ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రికి లేఖ రాసినా, ఎలాంటి స్పంద‌న రాలేద‌ని ఆమె పేర్కొంది. గ‌త జ‌న‌వ‌రిలో కూడా నళిని జైళ్ల శాఖ ఐజీకి కూడా సెల‌వు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు, ఆయన నుండి కూడా ఏవిధమైన స్పంద‌న రాక‌పోవ‌డంతో హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు .