పొత్తుకు సిద్దం : ఎస్‌పి, బిఎస్‌పి

SMTV Desk 2019-01-13 16:10:34  BSP, SP, Akhilesh yadav, Mayavati, BJP, Lok sabha elections, Lucknow, Uttar pradesh

లక్నో, జనవరి 13: రానున్న లోక్ సభ ఎన్నికల ఉత్తర్ ప్రదేశ్ లో బీజీపీ పై పట్టు సాధించేందుకు సమాజ్‌ వాద్‌ పార్టీ (ఎస్‌పి), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి) ఎన్నికల్లో కలిసి పోటీ చేయలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ అధినేతలు, మాజీ సిఎంలు మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. సమావేశం నిర్వహించారు. పొత్తు, సీట్ట పంపకాల గురించి ప్రకటన చేశారు. మాయావతి మాట్లాడుతూ రానున్న లోక్‌సభ ఎన్నికల్ల రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బిజెపిని ఓడించాలనే ఏకైక లక్ష్యం, ప్రజలకు మేలు చేయాలనే తలంపుతోనే చరిత్రాత్మక పొత్తుకు సిద్ధపడినట్లు వెల్లడించారు.ఇది దేశ రాజకీయాల్లో సరికొత్త విప్లవానికి దారి తీస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

యూపిలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలుండగా బిఎస్‌పి 38 స్థానాల్లో, ఎస్‌పి 38 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మిగతా నాలుగు సీట్లను ఇతర పార్టీలకు వదిలినట్లు ఆమె తెలిపారు. అమేథి స్థానాన్ని కాంగ్రెస్‌ కోసం విడిచిపెట్టినట్లు చెప్పారు. దేశ ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకుంటున్నాం. ఈ పొత్తు రెండు పార్టీల ప్రయోజనాలకోసం కాదు. భాజపాకు సమాధానం చెప్పేందుకు ఇదొక చారిత్రక సమావేశం. కోట్లాదిమంది ప్రజలు కేంద్రంలోని బిజెపిపై అసంతృప్తిగా ఉన్నారు. రైతులు, నిరుద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. బిజెపి, కాంగ్రెస్‌ పార్టీల ప్రత్యామ్నాయం కోసం యూపి ప్రజలు ఎదురుచూస్తున్నారనీ, అందుకే బిఎస్‌పి-ఎస్‌పి చరిత్రాత్మక పొత్తుకు సిద్ధపడ్డారని మాయావతి అన్నారు. రెండు జాతీయ పార్టీలు యూపి ప్రజలను మోసం చేశాయని పేర్కొన్నారు. అందుకే కొత్త రాజకీయ విప్లవానికి తాము నాంది పలికామని తెలిపారు.