ఏపీలో పార్టీనేతల వలసలు ప్రారంభం...

SMTV Desk 2019-01-13 15:36:17  Andhrapradesh Political partys, BJP, TDP, YSRCP, CPM, Janasena, Congress

విజయవాడ, జనవరి 13: ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల సందర్భంగా వొక పార్టీ నుండి మరో పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. కాగా కొన్ని నెలల్లో ఎన్నికలు రావడంతో మాజీ ఎమ్మెల్యేలు, నేతలు, ఆశావహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. వారికి నచ్చిన పార్టీల్లో చేరిపోతున్నారు.

తాజాగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు.. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కమలతో పాటు పలువురు కార్యకర్తలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. 2009 ఎన్నికల్లో కమల కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం ఆమె 2014లో పోటీ చేయలేదు.