పదవుల కోసం కాంగ్రెస్ నేతల పరుగులు....

SMTV Desk 2019-01-13 14:49:04  Telangana congress party, Congress party leaders, Telangana, Loksabha elections

హైదరాబాద్, జనవరి 13: గత ఎన్నికల్లో ఘోరంగా పరాజయ పాలైన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్తితి ఇప్పుడు మరీ దయనీయంగా మారింది. ప్రస్తుతం పార్టీలో ఉన్న మూడు పదవుల కోసం తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద తలకాయలుగా చలామణి అవుతున్న నేతలందరూ ఎదురుచూస్తున్నారు. ఎనికల్లో కేవలం 19 సీట్లు మాత్రం గెలుచుకొని కాంగ్రెస్ లో పార్టీపరంగా లభించే ప్రతిపక్ష నేత, పిఎసి ఛైర్మన్‌, పిసిసి అధ్యక్షపదవి ఈ మూడు పదవుల కోసం పోటాపోటీగా పైరవీలు సాగిస్తున్నారు. అసెంబ్లీకి గెలు పొందినవారు ఈ మూడు పదవుల విషయంలో ఆసక్తి పెంచుకోగా.. శాసనసభా స్థానానికి పోటీపడ్డ టిఆర్‌ఎస్‌ చేతి లో ఓడిపోయిన అభ్యర్థులు మరో ప్రయత్నంలో ఉన్నారు. మరో మూడు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకుగానూ పరాజయం పాలైన ప్రముఖులు దాదాపు అందరూ పార్టీటికెట్‌ దక్కించుకునే ప్రయత్నాలు ప్రా రంభించారు.

అసెంబ్లీకి అదృష్టం కలిసిరాకపోయినా.. లోక్‌సభలో అయినా అడుగుపెట్టాలనే లక్ష్యంతో అసెంబ్లీ పరాజితులు హస్తిన స్థాయిలో పావులు కదుపుతూ గెలుపోటములు ఎలా ఉన్నప్పటికీ పార్టీ టికెట్‌ అయినా దక్కించుకోవాలనే ప్రయత్నంలో తమతమ గాడ్‌ పాధర్స్‌ను ఆశ్రయిస్తున్నారు. రాజకీయాలంటేనే పదవులకోసం ఆశలు అధికంగా ఉంటుండగా కాంగ్రెస్‌ లోమాత్రం పదవుల లాలస మరింత అధికమని దీనికి పార్టీ క్రమశిక్షణ, ఇతరత్రా నిబంధనలేవీ పాటించ కుండా బహిరంగంగానే విమర్శల దాడిలో పాలుపంచుకోవడం కాంగ్రెస్‌ నేతలకు అలవాటే అని అనేక వర్గాలు చెప్పుకుంటాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రెండోసారికూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రతికూల ఫలితాలతో ఢీలాపడిన కాంగ్రెస్‌ నేతలకు మరో పరీక్షగా లోక్‌సభ ఎన్నికలు ముందుకు వచ్చాయి.