ఆర్థికాభివృద్దిని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర బడ్జెట్

SMTV Desk 2019-01-13 13:55:37  Telangana State Government, KCR, State Financial Development

హైదరాబాద్, జనవరి 13: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆర్థికాభివృద్దిని మరింత బలోపేతం చేసేదిశగా బడ్జెట్‌ ఉండాలని సంబందిత అధికారులకు సూచించారు. అంతేకాక రాష్ట్ర అభివృద్దిని పెంచు కోవడానికి అన్నిమార్గాల్లో పయనించడానికి, అవలంభించాల్సిన మార్గదర్శకాలేమిటి? తెలంగాణ రాష్ట్రంగా మన ఆర్థిక ప్రగతికి దోహదపడుతున్న అంశాలేమిటి? అనే అంశాలను పరిగణలోకి తీసుకుని బడ్జెట్‌ను రూపొందించాలని ఆయన సంబందిత అధికారులను ఆదేశించారు. భారత ఆర్థిక వ్యవస్థను గుణాత్మక దిశగా నడిపించేందుకు ఆర్థిక సంఘం నడుంబిగించాల్సి ఉందని, మూసపద్దతిలో కాకుండా తన పాత్రను వినూత్నంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని సిఎం అభిప్రాయపడ్డారు.

కాగా మరికొద్ది రోజుల్లో 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ బృందం రాష్ట్ర పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆర్థికశాఖ, ఇతర సీనియర్‌ అధికారులతో శనివారం కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నడుస్తున్న సాగునీటి వనరులతో సహా ఇతర శాఖలను సోదాహరణలుగా తీసుకొన్న సిఎం, ఆ దిశగా బడ్జెట్‌ ప్రపోజల్స్‌ను రూపొందించాలని కెసిఆర్‌ సూచించారు. సాగునీటి ప్రాజెక్టులకోసం బడ్జెట్‌ను రూపొందించే క్రమంలో ముందుగా గత నాలుగేళ్ల కాలంలో ఎంతఖర్చుచేసిందో రాబోయే ఐదేళ్ల కాలంలో ఎంతఖర్చు చేయనున్నది.. అనే అం శాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు. నడుస్తున ఆర్థిక సంవత్సరంసహా రానున్న ఐదేళ్ల కాలానికి మొత్తం కలిపి ఇరిగేషన్‌ శాఖకోసం రూ.2 లక్షల ఖర్చు కానునున్నట్లు సిఎం స్పష్టం చేశారు. కేంద్రంనుంచి అన్ని సాగునీటి ప్రాజెక్టుల అన్నిరకాల అనుమతులను సాధించడం గొప్ప కార్య మని అది బడ్జెట్‌లో ప్రతిఫలించాలన్నారు.