రేషన్‌ డీలర్లకు ఏపీ సర్కార్ సంక్రాంతి నజరానా

SMTV Desk 2019-01-13 13:29:42  Chandrababu, Ration dealers, Commission, State government

విజయవాడ, జనవరి 13: రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్లకు సంక్రాంతి కానుకను ప్రకటించింది. సరుకుల పంపిణీ కమీషన్‌ను వొక రూపాయికి పెంచింది. దీంతో 29వేల మంది రేషన్‌ డీలర్లకు లబ్ది చేకూరనుంది. తాము అధికారంలోకి వచ్చాక 25పైసల కమీషన్‌ను రూపాయి చేశామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. సరుకుల పంపిణీ కమీ షన్‌ 75పైసల నుండి వొకరూపాయికి పెంచామన్నారు.

దీంతో పంచ దార, బియ్యం, రాగులు, జొన్నలు, కందిపప్పు కమీషన్‌ను వొక్క రూపాయి చేశామన్నారు. గతేడాది కానుకల కమీషన్‌ రు.5 నుండి రు.10కి పెంచామని తెలిపారు. టిడిపి అధికారం లోకి వచ్చినప్పటినుండి కమీషన్‌ను రూపాయివరకు పెంచామన్నారు.