ఏపీ 39 సిరీస్‌తో కొత్త రిజిస్ట్రేషన్‌లు

SMTV Desk 2019-01-13 13:11:37  AP Govt, Andhra pradesh, state transport, ap 39 series

అమరావతి , జనవరి 13: దేశంలోనే ప్రథమంగా ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. “వొక రాష్ట్రం – వొకే నంబర్‌” విధానం అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు వొకే సిరీస్‌ నంబర్‌ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వాహనాలకు వొకే సిరీస్‌ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. దీంతో వాహనాన్ని ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్‌ చేయించుకునేలా సదుపాయం కలగనుంది. ఏపీ 39 సిరీస్‌తో కొత్త రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం కానున్నాయి. వొకే సిరీస్‌ విధానంతో రవాణా శాఖకు అధిక ఆదాయం వస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వాహనదారులకు సమయం, డబ్బు ఆదా అవుతుందని చెప్పారు.