జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో 5.6 లక్షల ఫిర్యాదులు.....

SMTV Desk 2019-01-13 12:38:01  Chandrababu, TDP, AP CM, Jnamabhoomi maaooru, Amaravti

అమరావతి, జనవరి 13: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ప్రతిస్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి-మాఊరు కార్యక్రమం 13 జిల్లాల్లో జరిగన గ్రామసభల్లో మొత్తం 5.6 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయని చంద్రబాబు వెల్లడించారు. శనివారం ఉండవల్లి ప్రజావేదికలో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను ఖచ్చితంగా పరిష్కరిస్తా మని ఆయన స్పష్టంచేశారు. ప్రభుత్వం చేపట్టిన గ్రామసభల్లో ఇప్పటి వరకు నాలుగున్నరేళ్ళుగా చేపట్టిన సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించినట్లు ఆయన గుర్తుచేశారు.

గ్రామసభల్లో తహసీల్ధార్లు, ఎంపిడివోలు, మండలస్థాయి అధికారులు, సమన్వయంతో పని చేశారని 1800మండల స్థాయి బృందాలు 12, 918గ్రామ పంచాయితీల్లో కలసి పనిచేసినట్లు ఆయన పేర్కొన్నారు.జన్మభూమి కార్యక్రమంలో 1.28లక్షల అధికారులు,1.70లక్షల కార్యాక్ర మాల్లో పాల్గొని గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిశీలించి అభివృద్ధి ప్రణాళిక తయారుచేశారని జన్మభూమిలో కూడా సంబంధిత ప్రాంత ప్రజలు 61.13శాతం మంది పాల్గొన్నారని జన్మభూమి కార్యక్రమం బాగుందని 77.97శాతం మంది తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు బాబు పేర్కొన్నారు. రూ.200ల ఫించన్‌ ఇచ్చి పదేండ్లుగా చెప్పుకుంటున్నారని తమ ప్రభుత్వం పదిరెట్లు పెంచి అన్ని రకాల పెన్షన్‌దారులకు న్యాయం చేయడానికి తాము కృషిచేస్తున్నట్లు బాబు పేర్కొన్నారు.