ప్రభుత్వ నిర్ణయాలను ఖాతరు చేయని టోల్ ప్లాజాలు...!!!

SMTV Desk 2019-01-13 12:26:02  Telangana toll plaza, Collects tax against state government, Jadcharla

జడ్చర్ల, జనవరి 13: సంక్రాంతి సందర్భంగా పలు ప్రాంతాల్లోని టోల్ ప్లాజాల యాజమాన్యం విచ్చల విడిగా ట్యాక్స్ వసూలు చేస్తుంది. వొకపక్క రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మూడు రోజుల పాటు ట్యాక్స్ వసూలు నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చినా టోల్ ప్లాజాల యాజమాన్యాలు మాత్రం పట్టించుకోవడం లేదు. నేషనల్ హైవే మీద టోల్ ప్లాజాలకు రాష్ట్ర ఉత్తర్వులు పనికిరావాలని కొందరు అంటే రాష్ట్ర హైవేల మీద కొందరు కూడా మాకు ఇంకా ఉత్తర్వులు రాలేదని మరికొందరు అంటున్నారు.

తాజాగా జడ్చర్ల టోల్ ప్లాజా వద్ద ట్యాక్స్ వసూల్ చేస్తుండడంతో ప్రయాణికులకు యాజమాన్యానికి మధ్య వాగ్వాదం మొదలైంది. కాసేపు ట్యాక్స్ ఎత్తేసిన యాజమాన్యం మళ్ళీ ట్యాక్స్ వసూల్ చేస్తుంది. ప్రశ్నించిన మీడియా మీద కూడా దురుసుగా ప్రవర్తించగా కృష్ణా జిల్లా ఉంగుటూరు టోల్ ప్లాజా వద్ద కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రయాణికులు ఆందోళలనకు దిగుతున్న యాజమాన్యాలు మాత్రం వెనక్కు తగ్గడం లేదు.