కళ్యాణ్ రామ్ '118' రిలీజ్ డేట్ ఫిక్స్.....

SMTV Desk 2019-01-13 12:04:52  Nandamuri Kalyan ram, KV Goohan, 118 Movie release date, Nivetha thomas, Shalini pandey, Eastcost productions

హైదరాబాద్, జనవరి 13: కె.వి.గుహ‌న్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్, నివేదా థామస్ జంటగా నటిస్తున్న చిత్రం 118 . ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇందులో సెకండ్ హీరొయిన్ గా షాలిని పాండే కనిపించబోతోంది. ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కొనేరు నిర్మిస్తున్న ఈ సినిమా మార్చ్ 1 న విడుదల చేస్తున్నట్లు నిర్మాత మహేష్ కోనేరు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత మ‌హేశ్ కోనేరు మీడియాతో మాట్లాడుతూ “నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌గారి 118 టైటిల్ లోగో, ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్‌ను ఇప్పటికే విడుద‌ల చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది . చిత్రం షూటింగ్ కూడా పూర్తి అయి నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

క‌ల్యాణ్ రామ్‌గారి పాత్ర లుక్ ఎలా ఉంటుంద‌నే విష‌యంతో పాటు అస‌లు సినిమా ఏ జోన‌ర్‌లో తెర‌కెక్కింద‌నే విష‌యాన్ని టీజ‌ర్ ద్వారా చూపించాం. సీట్ ఎడ్జింట్ థ్రిల్ల‌ర్ ఇది. క‌ల్యాణ్ రామ్‌గారు ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి జోన‌ర్. వెంక‌ట్‌, అన్బ‌రివు, రియ‌ల్ స‌తీష్ అద్భుతమైన యాక్ష‌న్ పార్ట్ సినిమాలో చాలా కీల‌కంగా ఉంటుంది. నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. బ్యూటీఫుల్ విజువ‌ల్స్‌తో ప్రేక్ష‌కుల‌ను మెస్మరైజ్ చేసిన ప్ర‌ముఖ ఛాయాగ్రాహ‌కులు కె.వి.గుహ‌న్‌గారు ఈ చిత్రంతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచయం అవుతున్నారు. ద‌ర్శ‌క‌త్వంతో పాటు ఆయ‌న క‌థ‌, క‌థ‌నం, సినిమాటోగ్ర‌ఫీ చేశారు. శేఖర్ చంద్ర సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు“ అన్నారు.