ఎన్టీఆర్’ బయోపిక్ పై ఎన్టీఆర్‌ స్పందన ఏది..?

SMTV Desk 2019-01-13 12:00:04  ntr, ntr biopic, kathanayakudu, jr ntr

హైదరాబాద్ , జనవరి 13:‘ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి పార్ట్ కథానాయకుడు ఈ నెల 9 వ తేదీన రిలీజ్ అయింది. ఎన్నో అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా ఎలా ఉన్నది అనే విషయాన్ని పక్కన పెడితే.. ఈ సినిమాను అనేకమంది ఫఫిలిం సెలెబ్రిటీలు మెచ్చుకున్నారు. ఈ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరిపోయారు. పెద్ద ఎన్టీఆర్ కు ఇచ్చిన ఘన నివాళి ఇదని మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లో ఇప్పటికే చాలామంది చేరిపోయారు.

ఇంతమంది సినిమా బాగుంది అని చెప్తుంటే వొక్కరు మాత్రం ఆ సినిమా గురించి ఇంతవరకు స్పందించకపోవడం విశేషం. అతనెవరో కాదు.. జూనియర్ ఎన్టీఆర్. హరికృష్ణ మరణం తరువాత ఎన్టీఆర్.. బాలకృష్ణ కుటుంబాల మధ్య సయోధ్య పెరిగింది. రెండు కుటుంబాలు కలిసిపోయాయి. అరవింద సమేత సక్సెస్ మీట్ కు బాలయ్య వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను కుటుంబ సభ్యులంతా చూసి బాగుంది అని మెచ్చుకుంటుంటే.. ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఆ సినిమాపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీనికి కారణం ఏంటనే విషయం బయటకు తెలియకపోయినా.. కొంతమంది మాత్రం ఎన్టీఆర్ ఇంకా సినిమా చూడలేదని.. చూసిన తరువాత ఖచ్చితంగా స్పందిస్తాడని అంటున్నారు.