తక్షణం చైనాపై అణుదాడికి సిద్ధం: అమెరికా ఆర్మీ అడ్మిరల్ జనరల్

SMTV Desk 2017-07-28 19:00:47  America fights China, America war, USA fights China

సిడ్నీ, జూలై 28: అధ్యక్షుడు అనుమతిస్తే చైనాపై అణుదాడికి సిద్దమని ఆయన ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని, ఆయన సరేనంటే చైనాపై ఎప్పుడో అణుయుద్ధం జరిగి ఉండేదని అమెరికా ఆర్మీ అడ్మిరల్ జనరల్, అమెరికా – పసిఫిక్ రేంజ్ కమాండర్ ఆడమ్ స్కాట్ స్విఫ్ట్ చేసిన ప్రకటన సంచలనం అయ్యింది. ఆయన ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీలో జరుగుతున్న సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ విధమైన కామెంట్స్ చేయడానికి కారణాలు కూడా వెల్లడించారు. అమెరికా యుద్ధ నౌకలకు సమీపంలోకి చైనా విమానాలు వచ్చాయి, మా యుద్ధ నౌకలను పేల్చే ప్రయత్నం చేశారు. చైనా మితిమీరి ప్రవర్తిస్తే మాత్రం సహించేది లేదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. మా మిత్ర దేశాలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. భారత్ పై తరచు మాటల యుద్ధం చేస్తున్న డ్రాగన్ దేశం ఈ వ్యాఖ్యలపై ఎలా సమాధానమిస్తుందో ఆసక్తికరంగా మారింది.