కాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం....

SMTV Desk 2019-01-13 11:28:44  Terrorist attack in jammu kashmir, Two terrorists died, Indian army

శ్రీనగర్, జనవరి 13: శనివారం సాయంత్రం కాశ్మీర్ లోని కుల్గాం జిల్లా కటపోర ప్రాంత పరిధిలో భారత భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. కాగా ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రావాదులు హతం అయ్యారు. మరో ముగ్గురు ఆ కాల్పుల్లో చిక్కుకున్నట్లు సమాచారం.

ఏరియా మొత్తాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్న బలగాలు ఆ ఉగ్రవాదులను సైతం ఏరిపారేసేందుకు జల్లెడ పడుతున్నాయి. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా, జమ్మూకశ్మీర్‌లోని రజౌరి జిల్లాలో ఎల్‌ఓసీ వెంబడి శుక్రవారంనాడు ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీ పేలుడులో వొక ఆర్మీ మేజర్, జవాను వీరమరణం పొందినట్టు ఆర్మీ ప్రతినిధి వొకరు చెప్పారు.